subhodayam.news
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 6:17 pm Digital Edition : jindham narahari

ఆర్మూర్ పట్టణంలోని మేరు కులస్తుల పిల్లలకు మేవా ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేత…

ఆర్మూర్: ఆర్మూర్ మేరు పట్టణ సంఘం భవనంలో జరిగిన మేవా ఆధ్వర్యంలో మేరు కుల విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిభ అవార్డుల మహోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని,మేరు కులానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.స్థానిక కౌన్సిలర్ తిరుమల సుమన్, మరియు లైఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామగిరి భాను  పిల్లలను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇస్తూ, విద్యార్థులకు తనవంతుగా 12,500 రూపాయలను విద్యార్థులకు అందజేయడం జరిగింది.భాషిత సుందర్  విద్యార్థులకు సర్టిఫికెట్ ఫైల్లను,స్నాక్స్ ను అందించినారు.ఈ కార్యక్రమ ప్రధాన వక్త వరంగంటి శ్రీనివాస్ విద్యార్థుల ఉద్దేశించి ఎన్నో మంచి విషయాలను మేరు కులానికి మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.ఆర్మూర్ పట్టణ మేవా అధ్యక్షులు దీకొండ కిషన్, పట్టణ అధ్యక్షులు రాజుల దేవి రవినాథ్, ప్రధాన కార్యదర్శి దీకొండ లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దరఖాస్తు శ్యాము,పోల్కం నారాయణ, గిరిరాజు,ప్రవీణ్ రాజు మేవా ప్రధాన కార్యదర్శి కొక్కు వినోద్ కోశాధికారి వరఁగంటి బసంత్ మేవా కార్యవర్గ సభ్యులు మరియు మేరు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.