ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
మెండోరా : మండిపోతున్న ఎండల తీవ్రత మధ్య ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లిన ఆయన, కూలీలకు తాగునీరు మరియు మజ్జిగ అందించి వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బుట్టడి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూలీలు ఇబ్బందులు పడకుండా గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎండల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, తరచూ నీరు మరియు శీతల పానీయాలు తీసుకోవాలని...