తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
నిరుద్యోగ యువతకు భారీ ఊరట.. వయో పరిమితి 44 ఏళ్లకు పెంపు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాలలో పాల్గొనే నిరుద్యోగ యువతకు కీలక శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయో పరిమితిని మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జి.ఓ.ఎంఎస్ నెం.86 ప్రకారం, ప్రస్తుతం ఉన్న 34 సంవత్సరాల గరిష్ట వయో పరిమితిని 44 సంవత్సరాలకు పెంచింది. ఈ సడలింపు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామక నోటిఫికేషన్లకు ఈ కొత్త వయో పరిమితి వర్తించనుంది. నిరుద్యోగ యువత...