కోమన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన బోధన అందుతుంది…
ఆర్మూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ కోమన్ పల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పిటిఎం మీటింగ్ కు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కావ్య, ఉపసర్పంచ్ ప్రవీణ్ గౌడ్ హాజరై విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది.తర్వాత ఆరవ తరగతిలో ఇద్దరు పిల్లల్ని సర్పంచ్ ఆధ్వర్యంలో చేర్చుకోవడం జరిగింది. తర్వాత బడిబాటలో భాగంగా ఊరిలో ర్యాలీ తీసి ఉపాధి పనిలో ఉన్నటువంటి 150 మంది గ్రామ సభ్యులను కలిసి ప్రాథమిక పాఠశాలలో,ఉన్నత పాఠశాలలో విద్యార్థులను చేర్చవలసిందిగా సర్పంచ్, ఉప సర్పంచ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కవిత ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలను కోరడం జరిగింది.