మచ్చర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి…

ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఆలూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, వినయ్ రెడ్డి ప్రత్యేక సహకారం మరియు కృషితో మచ్చర్ల గ్రామానికి సుమారు 30 నుండి 40 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హులైన పేద ప్రజలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఇళ్లను మంజూరు చేయించడం జరిగిందని,...