subhodayam.news
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 1:36 pm Digital Edition : Narendhar

బండి సంజయ్ కొడుకును అరెస్టు చేయాలి

బాల్కొండ: కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికార మదంతో నిజాలను మట్టి పెడుతున్నారని ఆయన రాజకీయ అరాచకారం తెలంగాణలో చెల్లదని బాల్కొండ మండలం మాజీ కో-ఆప్షన్ సభ్యులు షహీద్ అన్నారు. కేంద్ర మంత్రి కుమారుడిపై POSCO కేసు నమోదై 5 రోజులు గడుస్తున్న నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ ఎందుకు జరగడం లేదని ఆయన ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం రాజకీయ నాయకుల పిల్లలకు ఒక న్యాయం ఉండకూడదు అని ఇది రాజ్యాంగ విరుద్ధమని వెంటనే బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు .