బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి
బాల్కొండ: కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని బాల్కొండ మండల బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కేంద్ర మంత్రి కొడుకును ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆయన విమర్శించారు. పోస్కో కేసు నమోదైన చర్యలు తీసుకోకపోవడం భావ్యం కాదని అన్నారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇఫ్తేఖార్, డాక్టర్ ప్రసాద్ గౌడ్, నారాయణ, బాల రాజేశ్వర్, సయ్యద్ ఫయాజ్,...