విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలి -బాల్కొండ సర్పంచ్ రాజేష్
బాల్కొండ: వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్య పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ అన్నారు. బాల్కొండ పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో యోగ, ప్రాణాయామం ,మెడిటేషన్ , స్పోకెన్ ఇంగ్లీష్, , శాస్త్రీయ నృత్యం, , కంప్యూటర్, ఇండోర్ గేమ్స్ అయినటువంటి చదరంగం మొదలైన అంశాలు ఈ సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ ఇవ్వనున్న్నారని . ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ...