subhodayam.news
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 6:40 pm Digital Edition : Narendhar

విద్యార్థులు సమ్మర్‌ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలి -బాల్కొండ సర్పంచ్ రాజేష్

బాల్కొండ: వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్య పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్‌ క్యాంప్‌ల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని బాల్కొండ గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్ అన్నారు. బాల్కొండ పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సమ్మర్‌ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో యోగ, ప్రాణాయామం ,మెడిటేషన్ , స్పోకెన్‌ ఇంగ్లీష్‌, , శాస్త్రీయ నృత్యం, , కంప్యూటర్‌, ఇండోర్ గేమ్స్ అయినటువంటి చదరంగం మొదలైన అంశాలు ఈ సమ్మర్‌ క్యాంప్‌లో శిక్షణ ఇవ్వనున్న్నారని . ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక విద్యార్థి ఈ శిక్షణలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న వివిధ అం శాలు జీవితంలో ఎదగడానికి ఉపకరిస్తాయన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ . ఈ క్యాంప్‌ పది హేను రోజులపాటు సక్రమంగా కొనసాగుతుందని ఇంకా ఆసక్తిగా ఉన్న విద్యార్థులు ఇందులో చేరాల్సిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో, చిట్టాపూర్ సర్పంచ్ సట్ల ప్రవీణ్, కిషన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, చిట్టాపూర్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్, సిఆర్పి ప్రభాకర్, సుమలత, ఎం ఐ ఎస్ సుమన్, కంప్యూటర్ ఆపరేటర్ సద్గుణ , విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.