రైతుల సమస్యల కంటే ఇసుక దందాలపైనే కాంగ్రెస్ నాయకులకు శ్రద్ధ ఎక్కువ-వేముల ప్రశాంత్ రెడ్డి 

బాల్కొండ: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు ధర్నాలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి  పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు కరెంటు, నీళ్లు, మద్దతు ధర కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లపాటు వ్యవసాయాన్ని పండుగలా మార్చామని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు మళ్లీ...