subhodayam.news
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 8:12 pm Digital Edition : RAJU CH

19 సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసిన వెల్గటూర్ ZPHS స్నేహితులు

మెండోరా: వెల్గటూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ 2006–2007 బ్యాచ్ విద్యార్థులు 19 సంవత్సరాల తర్వాత ఘనంగా నిర్వహించిన గ్రాండ్ గెట్-టుగెదర్ కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పాత స్నేహితులు ఒకే వేదికపై చేరి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల రోజుల అనుభవాలు, ఉపాధ్యాయుల సేవలు, అప్పటి సంఘటనలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతోకాలం తర్వాత కలుసుకోవడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులను సన్మానించి, వారి ఆశీస్సులు పొందారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, జ్ఞాపికల అందజేత, గ్రూప్ ఫోటోలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది.

“స్నేహం కాలంతో మారదు… సంవత్సరాలు గడిచినా మనసులు మళ్లీ ఒకటయ్యాయి” అంటూ పాల్గొన్న పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.