ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్న సర్పంచి
వేల్పూర్: వేల్పూర్ మండలంలో అమీనాపూర్ గ్రామంలోశుక్రవారం ఉపాధి హామీ పనులను సర్పంచి గుండం సౌందర్య నవీన్ పరిశీలించారు.అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచి గుండం సౌందర్య నవీన్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మీకు కూలి డబ్బులు సకలములో వస్తున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. ఎండలువిపరీతంగా పెరుగుతున్నాయని త్రాగునీళ్లు టెంట్ ఏర్పాటు చేయాలని తగు జాగ్రత్తలు పాటించాలని వారికి ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. మీకు ఏసమస్యలైనా ఉంటే నాకు సెక్రెటరీ సమాచారము ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గంగాధర్, పాల్గొన్నారు..