subhodayam.news
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 9:16 am Digital Edition : RAJU CH

జనగణనలో వ్యక్తిగత కార్డుల వివరాలు అడగొద్దు

జనగణన అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధార్ నంబర్, పాన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం అడగరని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి వివరాలు కోరడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఎవరైనా బలవంతంగా సమాచారం అడిగితే జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల తహసీల్దార్ కార్యాలయం లేదా రెవెన్యూ శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్ 040-23456789 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాలని రెవెన్యూ శాఖ అధికారులు కోరారు.