subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:37 pm Digital Edition : RAJU CH

ఈదురు గాలులకు రహదారిపై కూలిన భారీ వృక్షం

ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల నుండి బట్టాపూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఈదురు గాలులు బలంగా వీయడంతో భారీ వృక్షం ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈదురు గాలులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల సమీపంలో జాగ్రత్తగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు. అలాగే అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, రహదారులపై తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.