subhodayam.news
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 2:13 pm Digital Edition : Narendhar

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ శ్రేణుల దాడి హేయకరం

బాల్కొండ: కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ, షహీద్ అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను తెలంగాణ డిజిపి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం.