దేవాదాయ కమిషనర్ ను కలిసిన బాల్కొండ పద్మశాలి సంఘం నాయకులు
బాల్కొండ: వేలాది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నర నారాయణుని దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమయ్యే నిధుల మంజూరు కోసం కాంట్రిబ్యూషన్ చెల్లింపు, మంజూరయ్యే నిధుల వివరాలు వంటి వివరాల కోసం నిజామాబాద్ జిల్లా ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామరాజు ను బుధవారం బాల్కొండ పద్మశాన సంఘం నాయకులు కలిశారు. గుడి పురాతన వైభవం , ప్రస్తుత ఆలయ స్థితిగతులు, నిర్మాణం గురుంచి సేకరించిన నమూనాల వివరాలను దేవదాయ శాఖ కమిషనర్ కు వివరించడానికి వీరు కలవడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందించడం జరిగింది....