Wednesday, June 10, 2026

దేవాదాయ కమిషనర్ ను కలిసిన బాల్కొండ పద్మశాలి సంఘం నాయకులు

📰 Generate e-Paper Clip

బాల్కొండ: వేలాది సంవత్సరాల క్రితం  ప్రతిష్టించిన బాల్కొండ మండల కేంద్రంలోని బ్రహ్మ సూత్ర శివాలయం, మార్కండేయ మందిరం, నర నారాయణుని దేవాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడానికి అవసరమయ్యే నిధుల మంజూరు కోసం కాంట్రిబ్యూషన్ చెల్లింపు, మంజూరయ్యే నిధుల వివరాలు వంటి వివరాల కోసం నిజామాబాద్ జిల్లా  ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామరాజు  ను బుధవారం బాల్కొండ పద్మశాన సంఘం నాయకులు కలిశారు. గుడి పురాతన వైభవం , ప్రస్తుత ఆలయ స్థితిగతులు, నిర్మాణం గురుంచి సేకరించిన నమూనాల వివరాలను దేవదాయ శాఖ కమిషనర్ కు వివరించడానికి వీరు కలవడం జరిగింది.   ఈ సందర్భంగా కమిషనర్  సానుకూలంగా స్పందించడం జరిగింది. త్వరలో గుడి కీ కొలతల గురుంచి ఇన్స్పెక్టర్ గారిని పంపుతానని అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్కొండ పద్మశాన సంఘం అధ్యక్షుడు అందే వెంకటగిరి, ఉపాధ్యక్షుడు భూస రత్నాకర్, సంఘం కోశాధికారి కొందరపు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Must Read
- Advertisement -
Latest News

“పర్యావరణ మిత్ర” జాతీయ అవార్డు గ్రహీత సేవలను అభినందించి సత్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ ఇటీవల మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ...

More Articles Like This