బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబరాలు.
ఈరోజు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు సాధించిన సందర్బంగా బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. అధ్యక్షులు మాట్లాడుతూ బెంగాల్ లో ఇన్ని రోజులు మమతా బెనర్జీ అక్రమ వలసదారులను రాష్ట్రంలో చేర్చుకుని వారికీ ఓటు హక్కు కల్పించి ఓటుంబ్యాంక్ గా మలుచుకొని పాలన సాగించారు. Sir వలన ఆ ఓట్లు తీయడం తో ఈ రోజు ఫలితాలలో ఘోర పరాజయం పాలయిందన్నారు. ప్రపంచ దేశాలకు హైందవ ధర్మాన్ని వ్యాపింప జేసిన స్వామి వివేకానంద పుట్టిన గడ్డ...