రైతు వారోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు

మెండోరా: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా, మే 4వ తేదీన రైతు వారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 8:30 గంటలకు స్థానిక రైతు వేదిక కార్యాలయంలో జరగనుంది. రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి కీలక అంశాలపై శాస్త్రీయ పద్ధతుల్లో రైతులకు వివరాలు అందించనున్నారు. రైతులు పెద్ద...