subhodayam.news
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 4:05 pm Digital Edition : RAJU CH

రైతు వారోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు

మెండోరా: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా, మే 4వ తేదీన రైతు వారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 8:30 గంటలకు స్థానిక రైతు వేదిక కార్యాలయంలో జరగనుంది. రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, నాణ్యమైన విత్తనాల వినియోగం, పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి కీలక అంశాలపై శాస్త్రీయ పద్ధతుల్లో రైతులకు వివరాలు అందించనున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై వ్యవసాయ శాఖ అందించే సలహాలు, సూచనలు పొందాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకుని మెరుగైన దిగుబడులు సాధించే అవకాశం ఉందని తెలిపారు.