subhodayam.news
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 10:40 am Digital Edition : RAJU CH

ఆర్మూర్‌లోనే సోమవారం గ్రీవెన్స్ – ప్రజలకు సౌకర్యం

ఆర్మూర్ : ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం ఇకపై డివిజన్ కేంద్రం అయిన ఆర్మూర్‌లోనే నిర్వహించబడనుంది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.

ఇప్పటివరకు తమ సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే, కొత్త నిర్ణయంతో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ప్రజలు ఇకపై ఆర్మూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలోనే తమ సమస్యలను నేరుగా తెలియజేసుకోవచ్చు.