subhodayam.news
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:36 pm Digital Edition : Narendhar

కేంద్ర అధికారులను మెప్పించిన బాల్కొండ సర్పంచ్

బాల్కొండ: హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమంపై అవగాహన సదస్సులో నిజామాబాదు జిల్లా బాల్కొండ మేజర్ గ్రామ పంచాయతి సర్పంచ్ గాండ్ల రాజేష్ గ్రామపంచాయతీ ఆదాయ వనరులపై చేసిన పలు సూచనలను పలువురు కేంద్ర అధికారులు ప్రశంసించారు. .ఇందుకు వివరాలు ఇలా ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం మొదటగా తెలంగాణలోని సొంతగా నిధులు సమకూర్చు కుంటున్న గ్రామపంచాయతీలను గుర్తించి మరిన్ని కొత్త ఆలోచనతో మీ గ్రామానికి ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనలను వారికి తెలియజేయండి అని కోరగా
బాల్కొండ సర్పంచ్ గాండ్ల రాజేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారులకు గ్రామ అభివృద్ధి కి స్వతహoగా ఎలా నిధులు సమాకుర్చుకోవాలో ఇందుకు కేంద్రం ఏవిధంగా సహాయం చెయ్యాలో వివరించడంతో సమావేశoలో సర్పంచులతో పాటు అధికారులు స్పందిoచడం జరిగింది.వెంటనే సభ వేదికపై ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉన్నత అధికారి గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికారి వివేక్ భరద్వాజ్ ఐ. ఏ. ఎస్,   స్పందించి, సర్పంచ్ ఆలోచన విధానాన్ని మేచ్చుకున్నారు.ఇదే వేదికపై తెలంగాణ పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శి ఏం. దాన కిషోర్, మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ డి. దివ్య, తో పాటు నాబార్డ్ డిప్యూటీ డైరెక్టర్ అజయ్ కుమార్  సూద్, బాల్కొండ సర్పంచ్ వివరించిన విధానాన్ని మేచ్చుకున్నారు.