ఆర్టీసీ సమ్మెతో పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ప్రకటించిన KU

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. యూనివర్సిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 24న జరగాల్సిన పరీక్షను మే 19కు మార్చగా, ఏప్రిల్ 25న నిర్వహించాల్సిన పరీక్షను మే 20కు వాయిదా వేశారు. విద్యార్థులు కొత్త తేదీలను గమనించి, పరీక్షలకు హాజరుకావాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.