LRS పెండింగ్ ఫీజులకు మరో అవకాశం
మెండోరా: తెలంగాణ వ్యాప్తంగా 2020లో LRS కోసం దరఖాస్తు చేసి ఇంకా ఫీజు చెల్లించని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మే 1 నుండి జూలై 31, 2026 వరకు పెండింగ్ ఫీజులను 25% డిస్కౌంట్‌తో చెల్లించే అవకాశం కల్పించింది. గడువు తర్వాత రాయితీలు ఉండవని అధికారులు తెలిపారు.