subhodayam.news
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 12:49 pm Digital Edition : Narendhar

బాల్కొండలో బస్సు షెల్టర్ కోసం వినతి

బాల్కొండ: బాల్కొండ మండలం కేంద్రం నుండి  ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు మరియు సామాన్య ప్రజలు నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ మరియు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అయితే, గ్రామంలోని ప్రధాన బస్సు స్టాప్ వద్ద ప్రయాణికుల కొరకు సరైన బస్సు షెల్టర్ (Bus Shelter) లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా వేసవిలో ఎండకు, వర్షాకాలంలో వానకు తడుస్తూ రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. వృద్ధులు మరియు చిన్న పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
కావున, దయచేసి మీరు స్పందించి, గ్రామీణ అభివృద్ధి నిధుల నుండి లేదా ఎమ్మెల్యే (MLA) నిధుల నుండి తక్షణమే బస్సు షెల్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గౌరవ బాల్కొండ సర్పంచ్ గండ్ల రాజేష్ గారిని వినతి పత్రం ద్వారా తోట నవీన్ కుమార్ మరియు అనికేష్ పవన్ విన్నవించుకోగా,సర్పంచ్ గారు సానుకూలంగా స్పందించి గత పాలక సమావేశంలో ఈ యొక్క విషయము తీర్మానించాము,త్వరలో పని ప్రారంభిస్తాం అని తెల్పడం జరిగింది,ఈ కార్యక్రమంలో గౌరవ బాల్కొండ ఉపసర్పంచ్ రాజేందర్ గారు కూడా పాల్గొన్నారు..