భక్తి మార్గ సేవలో వైవిధ్యాలెన్నున్నా… పరమార్థం ఒక్కటే…
ఆర్మూర్ : ఆరున్నర దశాబ్దాల వయసులో రిటైర్డ్ టీచర్ గా జింధం నరహరి ఆర్మూర్ వాస్తవ్యుడినైన నేను "తిరుమల పరకామణి సేవ" అనుభవం నిజంగా మాటల్లో చెప్పలేనిదని,ఇది నా అనుభవాన్ని ప్రతిబింబించే ఒక చక్కని అవకాశం... రోజువారీగా వచ్చే ధర్మం హుండీ డబ్బులు నోట్లు,ముడుపులు, కాయిన్స్ మూడు రోజుల పాటు వేరియేషన్ చేయడం ఒక గొప్ప అనుభవం అదృష్టంగా భావిస్తున్నాను.గత మూడు సార్లు ఈ పవిత్ర సేవా మహాయజ్ఞంలో పాల్గొంటూ ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితాన్ని ధన్యంగా మార్చింది. ఆ సేవలో పొందిన ఆనందం అనిర్వచనీయమైనది. మనసుకు శాంతి,ఆత్మకు తృప్తి ఇచ్చిన ఈ అనుభూతి భగవత్సాన్నిద్యములో గడిపిన...