subhodayam.news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 3:27 pm Digital Edition : RAJU CH

నడిమితండా జి పి లో నూతన ప్రింటర్ ప్రారంభం

మెండోరా: నడిమితండా గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రింటర్‌ను ఈరోజు సర్పంచ్ రవి నాయక్ ప్రారంభం  చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ వెంకటేష్, వార్డ్ మెంబర్లు మరియు గ్రామస్థులు కలిసి ప్రింటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవి నాయక్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్యాలయంలో అవసరమైన సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రింటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై గ్రామస్తులకు సంబంధించిన పత్రాలు, ధృవపత్రాలు త్వరితగతిన అందుబాటులోకి వస్తాయని చెప్పారు.