subhodayam.news
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 1:51 pm Digital Edition : jindham narahari

నందిపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

నందిపేట్: భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకొని పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.దశాబ్దాల అణచివేత దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా ఎంతోమంది అమరవీరుల ధనమాన ప్రాణ త్యాగాల తర్వాత కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతోని జలదృశ్యంలో ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీ కోట్లాది తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంక్షను నెరవేర్చి ఏర్పరచిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి పథంలో నడిపి తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా రాష్ట్ర పురోగతిని చేసిన గొప్ప నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేసిఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామరక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.