బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం… మెండోరలో జోష్!
మెండోరా : భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని మెండోర మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ జెండాను మండల టౌన్ ప్రెసిడెంట్ మిట్టపల్లి మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్ మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పార్టీ స్థాపన నుంచి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు...