subhodayam.news
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 5:20 pm Digital Edition : Narendhar

బాల్కొండ మండలంలో ముగిసిన జనగణన శిక్షణ తరగతులు

బాల్కొండ: జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు కు మరియు సూపర్వైజర్లకు బాల్కొండ మండలంలో రెండు విడతల శిక్షణ తరగతులతో శిక్షణ కార్యక్రమాలు పూర్తయినాయని చార్జ్ ఆఫీసర్ మండల తాసిల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ఇళ్ల జాబితా, జనాభా లెక్కల సేకరణపై సిబ్బందికి అవగాహన కల్పించారు.
t తొలిసారిగా పేపర్ రహితంగా, మొబైల్ అప్లికేషన్ ద్వారా జనగణన జరగనుండటంతో, ఎన్యూమరేటర్లకు మొబైల్ యాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చాo అన్నారు
ఈ సందర్భంగా అసిస్టెంట్ చార్జర్ ఆఫీసర్ బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ. జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకం అని, గృహ గణన, గృహ జాబితా తయారు చేయడం చాలా ముఖ్యమైన మొదటి కర్తవ్యమని తెలిపారు. ఆ ప్రక్రియను పకడ్బందీగా, తప్పులు లేకుండా చేయాలని అన్నారు. మొదటిసారిగా పేపర్ వాడకుండా మొబైల్ యాప్ ద్వారానే జనగణన జరుగుతుందని వారు వెల్లడించారు. గ్రామాలలో ఇండ్ల జాబితా, గ్రామ వివరాలు నమోదు చేయడంలో కార్యదర్శులు సహకరిస్తారని తెలిపారు. వారి సహకారంతో తప్పులు లేకుండా జనాభా లెక్కలు తయారు చేయాలని సూచించారు. మొదటి దశలో ఈ క్రింది విధంగా వివరాలు నమోదు చేస్తారు.
ప్రాంతంలో ఉన్న అన్ని ఇండ్లను గుర్తించి, వాటి వివరాలు నమోదు చేయడం.
ఇళ్ల సంఖ్య, నిర్మాణం, సౌకర్యాలు నీరు, విద్యుత్, మరుగుదొడ్డి మొదలైన వాటి గురించి సమాచారం సేకరించడం జరుగుతుందని ఆయనఅన్నారు. చివరగా సూపర్వైజర్స్ మరియుఎన్యుమరేటర్స్ లచే సేవా భావ ప్రతిజ్ఞ చేయడం జరిగిందివారు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిజాయితీగా బాధ్యతాయుతంగా వినయంగా మర్యాదగా, పారదర్శకంగా , ఓర్పుతో కచ్చితంగా సమాచారాన్ని సేకరిస్తామని ప్రమాణం చేశారు .ఈ శిక్షణా శిబిరంలో ఫీల్డ్ ట్రైనర్లు నరేందర్, ,ఐలాపురం రాజు, జూనియర్ అసిస్టెంట్ సురేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.