subhodayam.news
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 11:54 am Digital Edition : Narendhar

మొబైల్ ద్వారా జనాభా లెక్కల స్వీయ నమోదు…

దాదాపు పదహారేళ్ల క్రితం జరిగిన జనాభా లెక్కల సేకరణ ఇప్పుడు మళ్లీ జరగబోతుంది. ప్రతి ఒక్కరూ ఈ జనాభా లెక్కల నమోదు తమ మొబైల్ ద్వారా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అందుకు తగ్గట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు స్వీయ జనాభా నమోదు కార్యక్రమం మొబైల్ నెంబర్ ద్వారా చేపట్టే విధంగా పోర్టల్ ను డిజైన్ చేసింది. జనాభా లెక్కల అధికారులు వచ్చి వారు అడిగే 33 ప్రశ్నలకు జవాబుదారితనంతో మనమే స్వీయ నమోదు చేయవచ్చు. అన్ని ప్రశ్నలకు కుటుంబ పెద్ద కు వచ్చే ఐడి తో నమోదు చేసి హెచ్ /SE ID అనే ఐడి క్రియేట్ అవుతుంది. ఈ ఐడి నీ భద్రపరచుకొని మన ఇంటికి వచ్చే జనాభా లెక్కల అధికారికి చూయించి అప్రూవల్ తీసుకోవచ్చు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అధికారులు వచ్చినప్పుడు సమయము కలిసి రావడంతో పాటు జనాభా నమోదు ప్రక్రియ చాలా ఈజీగా జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.👇👇👇👇👇👇👇

1️⃣ ఈ లింక్ ఓపెన్ చేయండి 👉https://se.census.gov.in

2️⃣ Self Enumeration (HLO) Login వద్ద తెలంగాణ ఎంపిక చేసి, Captcha ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి.
3️⃣ Welcome పేజీలో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయండి.
4️⃣ ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించాలి. వచ్చిన OTP ఎంటర్ చేసి Verify & Proceed క్లిక్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
5️⃣ మీ జిల్లా, పట్టణం/గ్రామం, పిన్ కోడ్ వివరాలు నమోదు చేయండి.
6️⃣ మొబైల్ లో Location ON చేసి, మీ ఇంటి వద్ద రెడ్ మార్క్ సెట్ చేయండి. 📍
7️⃣ ఇళ్ల వివరాలకు సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, Preview ద్వారా చెక్ చేసి Submit చేయండి.
8️⃣ Submit చేసిన తరువాత H తో ప్రారంభమయ్యే 11 అంకెల SE ID వస్తుంది. దాన్ని స్క్రీన్‌షాట్ లేదా నోట్ చేసుకుని భద్రపరచండి. 📝
9️⃣ మే 11 తరువాత మీ ఇంటికి వచ్చే గణన అధికారికి ఈ SE ID చూపిస్తే వారు అప్రూవ్ చేస్తారు.