కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గంతో రోడ్లపైకి జనం వచ్చారు

బాల్కొండ: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ షహీద్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.కేసీఆర్  హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆగస్టు 2023లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా నైపుణ్యం లేని డ్రైవర్లను నియమించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని...