మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలి: మచ్చర్ల సాగర్ బీఆర్ఎస్ నందిపేట్ మండలాధ్యక్షుడు…

నందిపేట్: ఉమ్మడి నందిపేట్ మండలంలో సుమారు 1000 మందికి పైగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారని వారి అవసరాలకు తగ్గట్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ డిమాండ్ చేశారు. ఒక్క నూతపల్లి గ్రామంలో మాత్రమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని వేలాది మంది రైతులు ఆ ఒక్క గ్రామంలోకి తీసుకుపోవడం అసాధ్యంగా ఉందని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను సేకరించిందని గుర్తు చేశారు. ఒకే కేంద్రం ఏర్పాటు చేయడం పైగా అక్కడ హమాలీలు లారీల కొరత కారణంగా...