subhodayam.news
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:33 pm Digital Edition : jindham narahari

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలి: మచ్చర్ల సాగర్ బీఆర్ఎస్ నందిపేట్ మండలాధ్యక్షుడు…

నందిపేట్: ఉమ్మడి నందిపేట్ మండలంలో సుమారు 1000 మందికి పైగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారని వారి అవసరాలకు తగ్గట్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ డిమాండ్ చేశారు.

ఒక్క నూతపల్లి గ్రామంలో మాత్రమే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని వేలాది మంది రైతులు ఆ ఒక్క గ్రామంలోకి తీసుకుపోవడం అసాధ్యంగా ఉందని అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను సేకరించిందని గుర్తు చేశారు.

ఒకే కేంద్రం ఏర్పాటు చేయడం పైగా అక్కడ హమాలీలు లారీల కొరత కారణంగా రోజుకు ఒక లారీ కూడా కొనుగోలు చేయలేని,పరిస్థితి మరొక వైపు దళారీలు 2400 రూపాయల మద్దతు ధర ఉంటే 1500 రూపాయలకు కొనడానికి ప్రయత్నం చేస్తూ రైతును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఒకపక్క వడగాలులు మరొక పక్క అకాల వర్షం భయంతో రైతు సగానికి సగం నష్టపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వెంటనే అధికారులను చర్య తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి నందిపేట్ మండల పార్టీ తరపున చరవాణిలో సంప్రదించగా మండల జిల్లా స్థాయి అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్ర బాధ్యులను సంప్రదించగా వారు హమాలీలు లారీల కొరత ఉందని చేతులెత్తేస్తున్నారు వెంటనే అధికారులు ఉమ్మడి నందిపేట్ మండలంలో మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వేగంగా మొక్కజొన్నను వరి ధాన్యాన్ని సేకరించాలి లేకపోతే రైతుల తరఫున భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.