Date of Publish : 22 April 2026, 6:45 amDigital Edition : jindham narahari
డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి సేవలు అభినందనీయమన్న… ఈ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సీ.ఏ ఈరవత్రి రాజశేఖర్
నిజామాబాద్ డీసీపీ అడ్మిన్ శ్రీ జి. బస్వారెడ్డి బదిలీ సందర్భంగా, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీ సాయి చైతన్య , నిజామాబాదు, అర్బన్ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ సీఏ ఈ. రాజశేఖర్ హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, బస్వారెడ్డి గత 30 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించారని, ఎక్కువ కాలం ఇదే ప్రాంతంలో సేవలు అందిస్తూ ప్రజలతో సన్నిహితంగా పనిచేశారని తెలిపారు. ఆయన తన పనిని నిబద్ధతతో, అంకితభావంతో నిర్వహించడమే కాకుండా, పోలీస్ శాఖలో ఒక మంచి మానవతావాది (హ్యూమానిటేరియన్) గా పేరు తెచ్చుకుని, సమాజానికి ఆదర్శప్రాయమైన సేవలు అందించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్‌పర్సన్ శ్రీమతి కవితా రెడ్డి, ఎస్బీ సీఐ శ్రీశైలంను, సీఐ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బస్వారెడ్డి కి ఘనంగా సన్మానం చేసి, వారి భవిష్యత్ సేవలకు శుభాకాంక్షలు తెలియజేశారు.