చర్చలు విఫలమవడంతో… నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్…
రాష్ట్ర ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఈ రోజు అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని పలు విధాలుగా కోరిన ఫలితం లేకపోవడంతో గత నెలలో సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. తాజాగా టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఇవాళ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు. బుధవారం ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు విధులు బహిష్కరించనున్నారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు...