జనగణన పారదర్శకంగా పకడ్బందీగా చేపట్టాలి- తహసిల్దార్ శ్రీనివాస్
బాల్కొండ: త్వరలో చేపట్టనున్న జనగణన ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని బాల్కొండ మండల తాసిల్దార్ శ్రీనివాస్ ఏన్యుమరేటర్స్ మరియు సూపర్వైజర్స్ కు సూచించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన ప్రక్రియను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని, ఎక్కడ జాప్యం జరుగకుండా చూడాలని, డేటా సేకరణలో ప్రతి ఇంటిని సందర్శించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జనగణన ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం తెలిపే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ చార్జ్ ఆఫీసర్ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఫీల్డ్ ట్రైనర్స్ బోయెడ నరసయ్య మరియు గజేందర్, ఎన్నుమేరేటర్స్...