subhodayam.news
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 5:18 pm Digital Edition : Akula Suraj

మోతే లో ఈ నెల29న వారాంతపు సంత ప్రారంభం..

వేల్పూర్ వేల్పూర్ మండలం మోతే గ్రామంలోని ఈనెల 29న బుధవారం రోజున గ్రామపంచాయతీ అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వారాంతపు సంత ప్రారంభిస్తున్నట్లుగా సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి గ్రామఅభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.ఇట్టి సంత మోతే గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అలాగే వ్యవసాయదారులకు లాబాదాయకంగా ఉంటుందని అన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయం నుండి కొత్త హనుమాన్ మందిరం వరకు ఇట్టి వారాంతపు సంత కొనసాగుతుందని అన్నారు.ఈ సంత ప్రతి బుధవారం రోజున నిర్వహించడం జరుగుతుందని కావున చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు.