వేల్పూర్:వేల్పూర్ మండల కేంద్రంలోని మోతె గ్రామంలో ఏర్పాటు చేస్తున్న శ్రీచత్రపతి శివాజీ మహారాజ్ ప్రముఖ శిల్పి విగ్రహ తయారీదారు శ్రీనివాస్ ని సోమవారం కలిసి12అడుగుల విగ్రహాన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగిందని ఉపసర్పంచ్ తెలిపారు.విగ్రహ దాత అయినటువంటి అల్లపుల్ల గంగారెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల 25వేలరూపాయలు విగ్రహానికి అయ్యే పూర్తి ఖర్చును నేనే సొంతంగా భరిస్తానని చెప్పి విగ్రహతయారీదారులకు అడ్వాన్స్ చెక్కు అందజేయడం జరిగిందని అన్నారు.విగ్రహదాత అల్లపుల్ల గంగారెడ్డి కిగ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలోఉపసర్పంచ్ కర్రోల్లపరంజ్యోతి కుమార్,దామ సాయన్న,మేర మహేష్ పాల్గొన్నారు.