ఆర్మూర్ : నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామ వాస్తవ్యులు మాజీ సర్పంచ్,బీజేపి సీనియర్ నాయకుడు అబ్బి గంగారాం ఇటీవల అనారోగ్యంతో కోలుకోలేని పరిస్థితులో హైదరాబాద్ లోని బసవతారకం మరియు యశోద హాస్పిటల్లో చికిత్స పొందారు.చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 5 లక్షలు మంజూరు చేయించి అట్టి చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు వారి స్వగృహములో అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అబ్బి గంగారాం చాలా తెలివైన వాడని, ప్రజల కొరకు గ్రామ అభివృద్ధి కొరకు సర్పంచ్ గా ఎనలేని సేవలు అందించాడని తనకు పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో డైనమిక్ లీడర్ అని అభినందించారు.
మండల,జిల్లా స్థాయిలో ఏ సమస్యకైనా తగిన పరిష్కారాన్ని చూపే నాయకాగ్రగణ్యుడని కొనియాడారు.ఇలాంటి లీడర్ పది కాలాలపాటు జీవించాలని ప్రజలకు సేవ చేయడానికి భగవంతుడు శక్తి, యుక్తులు ప్రసాదించాలని,ఆయన మీద ఉన్న అభిమానంతో నేను 5 లక్షలు సీ.ఎం ఫండ్ నుండి మంజూరు చేయించానని అన్నారు. అనారోగ్య బాధితుడు అబ్బి గంగారాం మాట్లాడుతూ పీడిత తాడిత ప్రజల కోసం నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తూనే ఉంటానని తన ఆరోగ్య రక్షణకై ప్రభుత్వం ద్వారా చేయూతనందించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపి గ్రామ అధ్యక్షులు రాయికంటి భరత్ రెడ్డి,బీజేపి సీనియర్ నాయకులు నడ్పి నాగన్న, బద్దం నారాయణ,వాకిడి జీవన్ రెడ్డి,అబ్బి గంగారాం సతీమణి,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.