జనగణన పగడ్బందీగా నిర్వహించాలి- తాసిల్దార్ శ్రీనివాస్
బాల్కొండ :బాల్కొండ మండలంలో జనగణన ప్రక్రియకు సంబంధించిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఏప్రిల్ 21 వరకు మూడు రోజుల పాటు బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది.ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి విడతగా 34 మంది ఎన్యుమరేటర్లు 4 సూపర్వైజర్లకు ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.జనగణన నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, డేటా సేకరణ పద్ధతులు, సాంకేతిక అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా బాల్కొండ మండల చార్జ్ ఆఫీసర్ మరియు తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో కీలకమని తెలిపారు.అలాగే ఈ నెల...