దూదిగాం నేషనల్ హైవే 44 పై అరైవ్-అలైవ్ ప్రోగ్రాం
బాల్కొండ: రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా మెండోర మండలంలోని దూదిగాం గ్రామ శివారులో కోతిదేవుడు సమీపం బ్లాక్ స్పాట్ వద్ద నేషనల్ హైవే 44 పైన గమ్యం- సురక్షితం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్, గ్రామ సర్పంచ్ , మరియు NHAI అధికారులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించి, రోడ్డు ప్రమాదాల నివారణపై సమగ్రంగా అవగాహన కల్పించబడింది. సమావేశంలో ముఖ్యంగా క్రింది అంశాలపై వివరంగా చర్చించబడింది:హెల్మెట్ ధరించడం యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత గురించి...