ఆర్మూర్ లో నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్డీవో ఆఫీస్ ముందు విశ్రాంతి ఉద్యోగుల నిరసన ప్రదర్శన…

ఆర్మూర్ :ఆర్మూర్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు జేఏసి పిలుపుమేరకు సంఘ భవనం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పెన్షనర్స్ నల్లబ్యాడ్జిలు ధరించి తమ సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోహన్ రావు,ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల కు ఏలాంటి సౌకర్యాలు,సదుపాయాలు కల్పించడం లేదని అందుకు నల్లబడ్జీలతో నిరసన తెలుపుతున్నామన్నారు. మా అపరిస్క్రుత సమస్యలు 2 వ పీఆర్సీని 51% ఫిట్మెంట్ తో పెన్షనర్స్ అందరికీ వర్తించేటట్లు అమలు చేయాలని,పెన్షనర్స్ పెండింగ్ బిల్లులు...