రోడ్డు భద్రత పై ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎస్సై
వేల్పూర్: వేల్పూర్ మండలం హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ వద్ద ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మీ మైనర్ పిల్లలకు ధ్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని ఎస్సై కోరారు.అంతే కాకుండా బైకులు డ్రైవింగ్ చేస్తున్నప్పుదు ప్రతి ఒక్కరు హెల్మట్ ధరించాలి.మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్ చేయద్దు.ఎవరైన చట్టాన్ని ఉల్లంగించే పనులకు పాల్పడ్డ చర్యలకు వెనుకాడనని ఎస్సై సంజీవ్ అన్నారు.ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయడమే కాదు,దానిని పాటించాలని ఎస్సైసూచించారు.ఈకార్యక్రమంలోసర్పంచ్ మల్లయ్య,ఉపసర్పంచ్ మణికుమార్,వార్డు సభ్యులు,సెక్రటరీ భారత్,తదితరులుఉన్నారు.