సర్కార్ బడిలోనే తన చదువులు… మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్

బాల్కొండ: ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని మెండోరా పోలీస్ స్టేషన్ SI జాదవ్ సుహాసిని  అన్నారు . ఏర్గట్ల లోని PM SHRI ZPHS ఏర్గట్ల లో నిర్వహించిన *"INTERACTION OF GIRL STUDENTS WITH ROLE MODEL"* కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదవాలని SI పిలుపునిచ్చారు. ఏ విషయమైనా దృఢంగా నమ్మి కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు తమ కాళ్ళ మీద నిలబడాలని సూచించారు.సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని,...