Date of Publish : 15 April 2026, 9:03 pmDigital Edition : Narendhar
సర్కార్ బడిలోనే తన చదువులు… మెండోరా ఎస్సై సుహాసిని జాదవ్
బాల్కొండ:ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని మెండోరా పోలీస్ స్టేషన్ SI జాదవ్ సుహాసిని అన్నారు . ఏర్గట్ల లోని PM SHRI ZPHS ఏర్గట్ల లో నిర్వహించిన *”INTERACTION OF GIRL STUDENTS WITH ROLE MODEL”* కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదవాలని SI పిలుపునిచ్చారు.
ఏ విషయమైనా దృఢంగా నమ్మి కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు. ముఖ్యంగా బాలికలు తమ కాళ్ళ మీద నిలబడాలని సూచించారు.సమాజంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తమ పోలీస్ స్టేషన్కు ఇలాంటి కేసులు అనేకం వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు స్వతంత్రంగా తమ కాళ్లపై తాము జీవించ గలిగితే ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయని పేర్కొన్నారు.
ఉద్యోగం సంపాదించడం,ఏదైనా నైపుణ్యాన్ని పెంపొందించు కోవడం వల్ల స్వయం సమృద్ధి సాధించవచ్చని తెలిపారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు కొమర గిరి కృష్ణా చారి మాట్లాడారు. ప్రపంచంలో లక్ష్యమంటూ లేని మనిషి ఉండడని, కానీ ఆ లక్ష్యాలు పెడ దారిన పట్టే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం గొప్ప కాదని, దాన్ని ఆచరణలో పెట్టడం గొప్పతనం అని తెలిపారు.లక్ష్యం ఎప్పుడూ గొప్పగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా తాను జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని పి.జ్యోతి భావోద్వేగానికి గురయ్యారు.చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ప్రసాద్, సమిత,ఎస్ శ్రీనివాస్, విజయ్,రాజేందర్, రాజ నర్సయ్య, గంగాధర్, శ్రీనివాస్,జ్యోతి,ట్వింకిల్ కుమార్,నరేష్, గంగ మోహన్, కోమలి,రిషిక, కృష్ణవేణి, శ్రీలత పాల్గొన్నారు.