మచ్చర్ల (ఆలుర్ )లో మొగిలి సుదర్శన్ సేవలు మరువలేనివి…

ఆలూర్: ఆలూర్ మండలంలోని మచ్చర్ల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సోషల్ స్కూల్ అసిస్టెంట్ మొగిలి సుదర్శన్ ఈనెల 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా ఈ రోజు మచ్చర్ల గురెడి రెడ్డి కళ్యాణ మండపంలో సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారి పండరి సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఆలూర్ మండల ఎంఈవో నరేందర్, నాయక్ పోడ్ సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్, కార్యదర్శి పుట్ట శివశంకర్,విశిష్ట అతిథులుగా మచ్చర్ల సర్పంచ్ శ్రీమతి కట్ట మల్లవ్వ, ఉప సర్పంచ్ కట్ట నర్సారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆలూర్ మండల పీఆర్టీయు కార్యదర్శి...