subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 7:38 pm Digital Edition : jindham narahari

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా నివాలర్పించిన రిటైర్డ్ ఏటీవో రాములు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా నివాలర్పించిన రిటైర్డ్ ఏటీవో రాములు

నిజామాబాద్ : విశ్రాంత ఉద్యోగి ఏటివో రాములు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు మా వినమ్ర నివాళులు అర్పిస్తున్నామన్నారు.భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి దిశానిర్దేశం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ అని, ఆయన చూపించిన మార్గం మనకు స్ఫూర్తిదాయకం, ఆయన ఆలోచనలు మనకు మార్గదర్శకం.సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. ఈ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని మనమందరం ప్రతిన బూనుదామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీవో గుంజల సాయికుమార్ వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.