ఆర్మూర్: న్యాయం , సమానత్వం, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయనకు మా వినమ్ర నివాళులు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి దిశానిర్దేశం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ అని ఆయన చూపించిన మార్గం మనకు స్ఫూర్తి, ఆయన ఆలోచనలు మనకు మార్గదర్శకం. సమానత్వ సమాజ నిర్మాణం కోసం ఆయన కలలు కన్న భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. ఈ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను పాటిస్తూ సమాజానికి సేవ చేయాలని మనం సంకల్పిద్దాం.” అని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ అన్నారు