subhodayam.news
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 12:35 pm Digital Edition : Narendhar

శాంభవి హై స్కూల్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి అవార్డులు

బాల్కొండ: ఈ అభ్యాస అకాడమీ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు భారతీయ విద్యా భవన్ ఆడిటోరియము హైదరాబాద్ నిర్వహించిన ఒలంపియాడ్ మరియు ఐఐటి అవార్డ్ ఫంక్షన్ లో శాంభవి హై స్కూల్ బాల్కొండ. మొదటి మూడు స్టేట్ ర్యాంకుల విద్యార్థులను సభకు అధ్యక్షత వహించిన ప్రముఖుల చేత మెమెంటోస్ లను మరియు పాఠశాల చైర్మన్ మధుసూదన్ రాజు బొట్ల, కరస్పాండెంట్ రవీన్ ప్రసాద్ బొట్ల మరియు మంజుల బొట్ల లను సత్కరించడం జరిగినది. మొదట స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు జే. వర్షిని 9వ తరగతి (RMM) రామన్ మ్యాస్ మహోత్సవం, అదేవిధంగా U వెన్నెల 5వ తరగతిT-EAT లో మరియు B. తన్వి 5వ తరగతి K-SAT స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నూజత్ 9వ తరగతి(RSM) రామన్ సైన్స్ మహోత్సవ్ లో సాధించారు, అదేవిధంగా BVVS లో స్టేట్ 3rd సాధించిన మా విద్యార్థులు CHవివేక్ సాయి 9వ తరగతి మరియు E నందిత 5వ తరగతి సాధించడం జరిగింది.